తెలంగాణ సీఎం కేసీఆర్‌కి చీఫ్ అడ్వైజర్ అంటే ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ తాజాగా నియమితులయ్యారు. గతంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా విధులు నిర్వర్తించిన సోమేశ్ కుమార్ ఇప్పుడు కేసీఆర్ చీఫ్ అడ్వైజర్ హోదాలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ చీఫ్ సెక్రటరీ జారీ చేశారు. సోమేశ్ కుమార్‌కి కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పెద్ద హోదాలో సోమేశ్ కుమార్ నియమితులైన సందర్భంగా సీఎం కేసీఆర్ అతనికి అభినందనలు తెలిపారు.
నిజానికి సోమేశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. క్యాట్ ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టు రద్దు చేయడంతో సోమేష్ కుమార్ ఏపీకి బదిలీ అయ్యారు. తర్వాత ఏపీలో జాయిన్ అయినా కొంత సమయం తర్వాత అక్కడి నుంచి వాలంటరీ రిటైర్ సర్వీస్‌కి దరఖాస్తు చేసుకున్నారు.