Breaking: సీఎం పీఠంపై కీలక ప్రతిపాదన చేసిన సిద్ధరామయ్య..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సీఎంగా ఎవరిని నియమించాలనే విషయంపై తర్జనభర్జన కొనసాగుతోంది. సీఎం పదవి దక్కించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య తాజాగా ఒక అనూహ్య ప్రతిపాదన చేశారు.

సీఎం పీఠాన్ని పంచుకునేందుకు సిద్ధమంటూ దాదాపు క్లారిటీ ఇచ్చారు. పదవిని పంచుకునే విషయంలో కూడా సిద్ధరామయ్య ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2 ఏళ్ల పాటు తాను సీఎంగా కొనసాగుతానని, మిగిలిన మూడేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించవచ్చని సిద్ధరామయ్య ప్రతిపాదన చేయడం ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఈ క్రమంలో సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన చేస్తుండగా దాని వెనుక కారణమేంటనేది తెలియ రాలేదు. ఇది పక్కన పెడితే, ఈ ఇద్దరి నేతల నివాసాల వద్దకు మద్దతుదారులు పోటెత్తారు. మరి చివరికి కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరు కూర్చుంటారో తెలియాల్సి ఉంది.