బ్రేకింగ్: గిల్ సోదరిపై RCB ఫ్యాన్స్ పిచ్చి ట్రోలింగ్… కఠిన చర్యలు తప్పవంటూ ఢిల్లీ మహిళా కమిషన్!

RCB ఘోరమైన ఓటమి తరువాత ‘ఇది ఎంతో శుభకరమైన రోజు’ అని శుభమాన్ గిల్ సోదరి షాహనీలై సోషల్ మీడియా మాధ్యమంగా పోస్టు పెట్టడంతో RCB జట్టు ఫ్యాన్స్ ఆమె మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో ఆమెపై అభ్యంతరకర దూషణలు శృతి మించడంతో కడకు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి రంగంలోకి దిగారు.

ఈ నేపథ్యంలో ఆమె ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమకు ఇష్టమైన జట్టు ఓడితే గిల్ సోదరి ఏం చేసిందని ట్రోల్స్ చేస్తున్నారు? ఆమె పోస్ట్ చేయడం ఆమె తప్పా? ఆమెకంటూ వ్యక్తిగత స్వతంత్రం వుంది. దానికోసం ట్రోలర్స్ పర్సనల్ గా టార్గెట్ చేయడం అమానుషం అని ఆమె పరిగణించింది. గతంలో కోహ్లి కూతురిని దూషించిన వారిపై చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు వీరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.. అని తాజాగా ట్వీట్ చేశారు.