Breaking: ప్రజలకు RBI సూచన.. రూ. 2 వేల నోట్ల విషయంలో ఈ అపార్ధాలకు తావులేదు?

తాజాగా RBI (రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా) రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసిన సంగతి తెలిసినదే. అయితే ఈ విషయంలో RBI ప్రజలకు కొన్ని సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అసలు విషయం ఏమంటే, క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే 2 వేల రూపాయిల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేస్తోంది గానీ, ఎక్కడా రూ. 2 వేల నోట్లను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించలేదు. కాబట్టి ఈ విషయమై కన్ఫ్యూజ్ కావద్దని చెబుతోంది RBI.

2 వేల రూపాయల నోట్లను బయట సర్క్యులేషన్‌లో వుంచకూడదనే కారణంతోనే ఆర్బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రూ. 3.52 లక్షల కోట్ల 2 వేల నోట్లు చలామనీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయం వలన ఆర్థిక రంగం బలోపేతం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్లాక్ మనీని అరికట్టే విషయంలో ఇది కీలక ముందడుగు అని నిపుణుల విశ్లేషణ.