BREAKING : సినిమా లకి రష్మిక మందాన గుడ్ బై ?

BREAKING : కన్నడ సొగసరి ఒక్క సినిమా చూడలేనందుకు విపరీతమైన ట్రోల్లింగ్ గురైంది.. ఇక తను ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. తప్పే అంటున్నారు ట్రోలర్స్.. ప్రతి చిన్న దానికి తనని టార్గెట్ చేస్తూ.. విసుగు పుట్టించే లాగా చేస్తున్నారు. ఏకంగా ఇండస్ట్రీ వదిలి వెళ్లే పరిస్థితి దాకా తీసుకువచ్చారా అంటే నిజమే అంటుంది రష్మిక..

Advertisement
Rashmika mandanna Is leaves movie industry
Rashmika mandanna Is leaves movie industry

కాంతారా చూడలేనందుకు విపరీతమైన ట్రోలింగ్ కి గురైంది రష్మిక. రిషబ్ శెట్టి, రాకేష్ విషయంలోనూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. తాజాగా మిషన్ మజ్ను వల్ల కూడా ట్రోలింగ్ గురైంది. అయితే ఇలా జరిగిన ప్రతిసారి చాలా బాధపడినట్లు రష్మిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది..

Advertisement

కాగా సినీ పరిశ్రమ వదిలి వెళ్లాలనుకున్నారా అన్న ప్రశ్న పై అవుననే స్పందించింది రష్మిక. వర్కౌట్ చేస్తే మగాడిలా కనిపిస్తున్నానని.. చేయకపోతే లావుగా ఉన్నానని అంటూ ట్రోలింగ్ చేస్తున్నారని.. ఎక్కువ మాట్లాడితే ఒకలాగా.. తక్కువ మాట్లాడితే మరోలాగా ట్రోలింగ్ చేస్తున్నారని కన్నడ సొగసరి వాపోయింది.. ఇన్ని ఇబ్బందులు మధ్య తాను ఇండస్ట్రీలో ఉండాలా వద్దా అని చాలా సార్లు అనుకున్నట్లు తెలిపింది..

తాను ఎలా ఉండాలో.. ఎలా కనిపించాలో.. ఎలా మాట్లాడాలో.. క్లారిటీ ఇవ్వాలంటూ ట్రోల్ చేసే వారిని కోరింది. నాతో మీకు ఏమైనా సమస్య ఉంటే అది చెప్తే దానిని సరి చేసుకుంటానని విన్నవించుకుంది.. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్స్ కు రష్మిక బాగా ఫీల్ అవుతుంది. అందుకే మీడియాతో ఈ విధంగా స్పందించింది.

Advertisement