బ్రేకింగ్: రూ.2 వేల నోట్ల ఎఫెక్ట్ తో భారీగా అమ్ముడవుతున్న రైల్వే టికెట్లు!

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ఏ ముహూర్తాన రూ.2వేల నోట్లను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుందోగానీ, ఇక అక్కడినుండి దేశంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజలు వాటిని మార్చుకునేందుకు రకరకాల మార్గాలను అనుసరించడం మనం గమనించవచ్చు. కాగా దీనికి సంబందించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజగా గుజరాత్లోని సూరత్ రైల్వేస్టేషన్లో టికెట్ల కౌంటర్ నిన్న ఒక్కసారిగా రద్దీగా మారడం గమనార్హం. పెద్ద ఎత్తున ప్రజలు రూ.2వేల నోట్లను మర్చి టికెట్లను కొనుగోలు చేయడం జరిగింది.

ఇకపోతే, సాధారణ రోజుల్లో 2వేలు నుంచి 2,500 టికెట్లు అమ్ముడుకాగా, నిన్న ఒక్కరోజే ఏకంగా 5వేలకు పైగా టికెట్లను విక్రయించడం గమనార్హం. ఇంకో విషయం ఏమంటే 2 వేల నోట్లని రద్దు చేయడమే ఆలస్యం కొన్ని విమాన సంస్థలు టికెట్ల రేట్లను అధికంగా పెంచేసాయి. ఈ విషయంలో కేంద్రం టికెట్ల రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచొద్దని ఎయిర్లైన్స్కు వార్నింగ్ ఇచ్చింది. ధరల రేంజ్‌‌లో ఎక్కువ తేడా లేకుండా చూడాలని సూచించింది. గో ఫస్ట్ఎయిర్లైన్స్ తన విమాన సర్వీసులను రద్దు చేసిన నేపథ్యంలో ఆ సంస్థ విమానాలు నడిపే రూట్లలో విమాన టికెట్ల రేట్లు బాగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.