Breaking: మే 19న NTR30 నుంచి ఫస్ట్ లుక్..

ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తదుపరి మూవీ ‘NTR30’పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను విడుదల చేయాలని, అంతకంటే ముందు అంటే మే 19న ఫస్ట్ లుక్‌ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సినీ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమాకి ‘దేవర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ చాలా బాగుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోని వర్గాల అభిప్రాయపడుతున్నట్లు కూడా సమాచారం. “సముద్రం నిండా రక్తంతో అతని గురించి రాసిన కథలే ఉన్నాయి” అంటూ పోస్ట్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివిల్ చేశారు. ఇక పోస్టర్ ఎలా ఉంటుందో చూసేందుకు మరో రెండు రోజులు అభిమానులు ఓపిక పట్టక తప్పదు.