బ్రేకింగ్ న్యూస్: ఎన్టీఆర్ 30 అప్డేట్ వచ్చేసింది గురూ… అదుర్స్ అంతే!

అవును, జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30 అప్డేట్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలే వుంది. రేపు అనగా మే 20నాడు మనందరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజన్న సంగతి అందరికీ విదితమే. ఈ సందర్భంగా.. అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సదరు సినిమాకు ‘దేవర’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ… సినిమా ఫస్ట్ లుక్ ని చిత్రయూనిట్ కాసేపటి క్రితమే రిలీజ్ చేసింది.

RRR తర్వాత తమ అభిమాన హీరో ఎన్టీఆర్ సినిమా కోసం నందమూరి అభిమానులు చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే అంతలా ఎదురు చూసిన అభిమానులకు ఎన్టీఆర్ లుక్.. దాహాన్ని తీర్చిందనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.