కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారంలో వరుస ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఈరోజు పులివెందులలో చికిత్స తర్వాత కడప అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని హైదరాబాద్‌కు స్పెషల్ అంబులెన్సులో కుటుంబ సభ్యులు తరలించారని తెలిసింది. తర్వాత కర్నూల్ ఆసుపత్రికి తీసుకెళ్లారని సమాచారం. మరోవైపు తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి డుమ్మా కొట్టారు. తర్వాత అతని ఎక్కడికి వెళ్లారో చాలాసేపటి వారికి తెలియలేదు. కాగా లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, అవినాష్ రెడ్డికి ఛాతిలో నొప్పి వచ్చింది. దాంతో తన తల్లి చేరిన ఆసుపత్రిలోనే అవినాష్ రెడ్డి ఇప్పుడు అడ్మిట్ అయ్యారు.