Breaking: మహేష్ బాబు కొత్త లుక్ వైరల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఫొటో షేర్ చేశారు. ఇందులో ఈ రాకుమారుడి లుక్ అదిరిపోయింది. సన్ గ్లాసెస్ పెట్టుకొని.. బియర్డ్, మీసాలు ట్రిమ్ చేసుకుని.. చెదిరిన హెయిర్ స్టైల్‌తో మహేష్ బాబు చాలా హాట్ గా కనిపించాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయ్యుండి, 47 ఏళ్ల వయసులోనూ పెళ్లి కాని కుర్రాడి లాగా మహేష్ కనిపించాడు. దాంతో అమ్మాయిలు అతడి అందానికి దాసోహం అంటున్నారు. నమ్రతా శిరోద్కర్, శిల్పా శిరోద్కర్ మహేష్ కొత్త లుక్ పై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఒకరు ఫింగర్స్ తో లవ్ షేప్ చూపించే ఎమోజీలు కామెంట్ చేస్తే నమ్రత ఫైర్ ఎమోజీలను కామెంట్ రూపంలో పోస్ట్ చేసింది.

మహేష్.. సెల్ఫీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన గంటలోపే మూడు లక్షల పైగా లైక్స్ వచ్చాయి. చాలామంది అభిమానులు మహేష్ కొత్త లుక్ అదిరిపోయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు.