Breaking: ఆ టెలికాం కంపెనీలో ఒకేసారి 55 వేల ఉద్యోగాలు తొలగింపు..

యూకేలోని టెలికాం కంపెనీ అయిన BT గ్రూప్, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా 2030ల చివరి నాటికి 55,000 ఉద్యోగులను తీసేస్తామని ప్రకటించి సాధించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా BT గ్రూప్ 2030 నాటికి దాని శ్రామిక శక్తిని 75,000-90,000 మధ్యకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. BT CEO, ఫిలిప్ జాన్సెన్, కంపెనీ భవిష్యత్తులో మరింత తక్కువ శ్రామిక శక్తితో, మరింత సమర్థవంతంగా మారాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఆర్థిక సవాళ్లకు, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కంపెనీలు ఖర్చు తగ్గింపు చర్యలను అమలు చేస్తున్నాయి. టెక్, టెలికాం పరిశ్రమలోని సంస్థలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. UK ఆధారిత వైర్‌లెస్ క్యారియర్, వొడాఫోన్ కూడా 11,000 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. BT లేఆఫ్ నిర్ణయం దాని ఫైబర్-ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్, 5G మొబైల్ నెట్‌వర్క్‌లను పెరుగుపరచడంలో కీలకంగా మారనుంది.