బ్రేకింగ్: Jr ఎన్టీఆర్ అభిమానులు అరెస్ట్… కత్తులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారంటూ కేసు!

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో కటకటాల పాలయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున ‘సింహాద్రి’ సినిమా రీరిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలోని 2 థియేటర్ల వద్ద అభిమానులు కత్తులతో హల్చల్ చేశారు. రెండు మేకలను వేటకొడవళ్లతో నరికి మరీ వాటి రక్తాన్ని ఎన్టీఆర్ ఫ్లెక్సీపై చిందించారు.

దానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఎన్టీఆర్ అభిమానులు అనబడేవారిని 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మారణాయుధాలు వినియోగించి, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారంటూ కొంతమంది పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడంతో కేసు నమోదు చేసారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ… అభిమానం ఉండొచ్చు గానీ, ఆ అభిమానం ఇతరులకు హాని కలిగించేదిగా ఉండకూడదు అని చెబుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి సందర్భాలలో మూగజీవాలను హింసిస్తే చూస్తూ ఊరుకొనేది లేదని వార్నింగ్ ఇచ్చారు.