Breaking:ఇండియాలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు… కొత్తగా 1331!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుండడం ఇపుడు ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఈ సంఖ్య నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కాస్త తక్కువనే చెప్పుకోవాలి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ విషయమై తాజాగా ఓ ప్రకటన చేసింది. ఆ వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 1,44,767 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 1,331 కొత్త కేసులు బయట పడడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,49,72,800కి చేరింది.

అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని సమాచారం. కాగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి 4,44,18,351 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దాంతో ఇపుడు ఇక్కడ మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,707కి చేరింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.05 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,79,735 ) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.