భారత ప్రభుత్వం నవంబర్, 2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగా రూ.500 నోటుతో పాటు రూ.2,000 నోట్లను ప్రింట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే, ఇతర డినామినేషన్లలోని నోట్లు దేశ ప్రజలకు అవసరమైన పరిమాణంలో అందుబాటులోకి వచ్చాక రూ.2000 నోట్ల లక్ష్యం నెరవేరింది. దాంతో 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణ నిలిపేసింది.
రూ.2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లలో దాదాపు 89% మార్చి 2017కి ముందు జారీ చేయబడినవే. ప్రస్తుతం రూ.2000 నోట్లు చలామణిలో లేకపోయినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతర డినామినేషన్లలోని నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయేలా ఉన్నాయని ఆర్‌బీఐ చెబుతోంది. పైన పేర్కొన్న వాటిని దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ బ్యాంక్ క్లీన్ నోట్ పాలసీ ప్రకారం, రూ.2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.