ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసే ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఆ ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఈ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అనేది 12 శాతం ఉండగా ఇప్పుడు దానిని 16 శాతానికి ప్రభుత్వం పెంచింది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు పెరిగిన హెచ్ఆర్ఏ వర్తిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు అంటే ప్రభుత్వం ఉద్యోగులు వారి గృహ ఖర్చుల కోసం వారి జీతంలో భాగంగా పొందే డబ్బు మొత్తాన్ని పెంచింది.