ఆధార్ కార్డులోని వివిధ మార్పులు అనగా పుట్టినతేదీ, చిరునామా, పేరు తదిదర వివరాలు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా మార్చుకునేందుకు ఉడాయ్ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) జూన్ 14వరకు అవకాశం ఇస్తూ పొడిగించింది. అయితే ‘మై ఆధార్ పోర్టల్’ ద్వారా మాత్రమే ఈ ఉచిత సేవలు వర్తిస్తాయని ఉడాయ్ ప్రకటించింది. ఇంకా అలాంటి మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకున్నవారు వేంటనే చేసుకోగలరని మనవి.
అలాకాకుండా ఆధార్ సేవా కేంద్రాల ద్వారా అప్‌డేట్, డెమొగ్రాఫిక్ మార్పులు చేయిస్తే మాత్రం రూ.50 చెల్లించాల్సి వుంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కోసం ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ సౌకర్యం అమలు జేస్తున్నట్టు కేంద్రం తాజాగా పేర్కొంది. పేరులో అక్షర దోషాలు, పుట్టిన తేదీ, చిరునామా మార్పులు, లింగం అలాగే 10 ఏళ్లుగా ఆధార్ అప్‌డేట్ చేసుకోని వారు ఈ ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఉడాయ్ సూచించడం విశేషం. ఇందుకోసం నిర్దేశిత జాబితాలో సూచించిన గుర్తింపు, చిరునామా పత్రాల్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.