BREAKING : జబర్దస్త్ షో ని ఆపేస్తోన్న ఈటీవీ ?? 

BREAKING : బుల్లితెర పై ప్రసారమౌతున్న కామెడీ షో జబర్దస్త్ కూడా ఒకటి.. ఎన్నో ఏళ్ళ నుండి ఈ కామెడీ షో ప్రసారం అవుతూ ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది. అంతేకాకుండా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఎక్కువ ఎంటర్టైన్మెంట్, కామెడీ కోరుకునే ప్రేక్షకులకు జబర్దస్త్ తో పాటు మరికొన్ని షోలు కూడా వచ్చాయి. ఈటీవీ రేటింగ్ లో చూసినట్లయితే మిగతా షోల కంటే జబర్దస్త్ టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇవ్వన్నీ ఒకప్పటి మాటలు..

Breaking ETV Jabardasth show has stopped news viral beacuse
Breaking ETV Jabardasth show has stopped news viral beacuse

జబర్దస్త్ కార్యక్రమం గతంలో మాదిరిగా భారీ ఎత్తున రేటింగ్ ఈ మధ్యకాలంలో నమోదు అవ్వడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా గతంలో మాదిరిగా రేటింగ్ను సొంతం చేసుకొనే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించలేదని తెలుస్తోంది. మల్లెమాల వారు లవ్ స్టోరీలను కొత్తగా చూపించే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా లవ్ ట్రాకులను సృష్టించేందుకు పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

 

రాకేష్ లవ్ ట్రాక్ జబర్దస్త్ కార్యక్రమంలో వీరిద్దరూ ఏదో కొత్తగా ప్రేమలో పడ్డారని వారిద్దరి ప్రేమను ఇప్పుడే చూపిస్తున్నామన్నట్లుగా ప్రోమోలో హైలెట్ చేశారు. ఈ సన్నివేశాలు ఎన్నో జంటలకు కూడా చేశాయి. ఇవన్నీ చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మల్లెమాల సంస్థ పైన కూడా పలువురు నెటిజెన్లు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

కొత్త కంటెస్టెంట్ లేకపోతే జబర్దస్త్ కార్యక్రమాన్ని మూసివేయాలి.. అంతేతప్ప ఇలాంటివి తీయవద్దు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. ముఖ్యంగా గతంలో లాగా కమెడియన్స్ ఇప్పుడు కామెడీ చేయడం లేదు.. అనే కామెంట్లు చేస్తున్నారు. పాత కమెడియన్స్ ను కూడా తీసుకురావాలని మల్లెమాలవారికి ప్రేక్షకులు రిక్వెస్ట్ చేస్తున్నారు.

 

జబర్దస్త్ షో పైన చేసే లవ్ ట్రాక్లు, ఎమోషనల్ మరికొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు విసుగు తెప్పించేలా ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక వీటి పైన పలు ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. కొత్త కమెడియన్స్ వచ్చిన వారు కూడా అలరించ లేక పోతున్నారు. పాత కమెడియన్స్ ని తీసుకు రావాలని కోరుకుంటున్నారు నేటిజన్స్.