Breaking: ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని సరికొత్త బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును తాజాగా ప్రారంభించారు. ముందుగా అనుకున్న ముహూర్తానికి అంటే మధ్యాహ్నం ఒంటిగంటా 5 నిముషాలకు రిబ్బన్ కట్‌ చేసి పార్టీ సెంట్రల్ ఆఫీసును ఆయన ఆవిష్కరించారు. 20,000 చదరపు గజాల్లో నిర్మించిన ఈ ఆఫీస్ విస్తీర్ణం 1300 గజాలు ఉండటం విశేషం. ఐదు అంతస్తులు ఉండే ఈ ఆఫీసులో అధ్యక్షుడి రూమ్, కార్యదర్శుల కోసం మరో నాలుగు స్పెషల్ రూమ్స్ ఉన్నాయి.

అంతేకాకుండా దీనిలో 40 మంది కూర్చునేలా ఒక కాన్ఫరెన్స్‌ హాల్‌ను నిర్మించారు. మొత్తం మీద బీఆర్ఎస్ జాతీయ పార్టీ జాతీయ స్థాయి కార్యపాలాపాలకు అనువుగా ఉండేలా దీనిని నిర్మించారు. పార్టీ ఆవిష్కరణ ప్రారంభోత్సవ వేడుకలలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభోత్సవం తర్వాత మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఇక 2021 సెప్టెంబర్ 2న ఈ కార్యాలయ నిర్మాణానికి అనుకున్న స్థలంలో భూమి పూజ చేశారు. మొత్తం మూడు అంతస్తులు, 20 గదులు నిర్మించడానికి చాలానే సమయం తీసుకున్నారు.

Advertisement

Advertisement
Advertisement