చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌కు భారీ ఝలక్కిచ్చింది. క్వాలిఫైయర్1లో 15 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్‌కు దూసుకుపోయింది. ఇక చెన్నై ఇలా ఫైనల్‌కు వెళ్లడం తొలిసారేమీ కాదు, 10వ సారి. ఈ విజయంతో ఫైనల్స్ లోకి అడుగుపెట్టడంతో.. ప్లేయర్స్ సందడి షురూ చేసారు. ఈ క్రమంలో ప్లేయర్ DJ బ్రావో లిఫ్ట్ లో వెళ్తూ.. పాట పాడుతుంటే మిగతా ప్లేయర్లు డ్యాన్సులు వేశారు. ఈ వీడియోను ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తూ.. ‘డీజే బ్రావో అంటార్రా బాబు’ అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ 38 బంతుల్లో 42 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. చెన్నై బౌలర్ల ధాటికి డాసున్ శనక (17), వృద్ధిమాన్ సాహా (12), విజయ్ శంకర్ (14), హార్దిక్ పాండ్య (8), డేవిడ్ మిల్లర్ (4), రాహుల్ తెవాతియా (3) వరుసగా పెవిలియన్‌కు చేరారు. చివరగా తుషార్ దేశ్‌పాండే వేసిన 19వ ఓవర్‌లో రషీద్ ఖాన్ ఔట్ కావడంతో చెన్నై విజయం ఖరారైంది.