ఆర్‌బీఐ రూ.2000 నోటును సర్కులేషన్ నుంచి తీసేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలలోగా వీటిని బ్యాంకుల్లో లేదా ఆర్‌బీఐ కేంద్రాల్లో తిరిగి ఇచ్చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎవరి దగ్గర రూ.2000 నోట్ల కట్టలు ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. సరిగ్గా ఇదే సమయంలో హీరో మంచు విష్ణు ఓ సెన్సేషనల్ ట్వీట్ చేశాడు.
కమెడియన్ వెన్నెల కిషోర్ ఇంట్లో రూ.2000 నోట్ల కట్టలు చాలా ఉన్నాయని, వాటిని అతను ఏం చేస్తాడో తెలియడం లేదని పేర్కొన్నాడు. నోట్ల కట్టల ఫొటో కూడా షేర్ చేశాడు. దీనికి వెన్నెల కిషోర్ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. “నా మీద పడతారేంటి” అని రిప్లై ఇచ్చాడు. నిజానికి వెన్నెల కిషోర్ మంచి విష్ణు మధ్య మంచి అనుబంధం ఉంది వీరిద్దరి పరిచయం “దేనికైనా రెడీ” సినిమా నుంచి మరింత బలపడింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య సరదాగా సెటైర్లు పేలుతున్నాయి. 2000 నోట్ల రద్దును కూడా విష్ణు వెన్నెల కిషోర్‌ని ఆటపట్టించడానికి వాడేసుకున్నాడని నెటిజన్లు అంటున్నారు.