రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజలు కంగారు పడాల్సిందేమీ లేదని నిపుణుల చెబుతున్నారు. ఈ నోట్లను సర్క్యూలేషన్ మాత్రమే తొలగిస్తున్న విషయం తెలుసుకోవాలని సూచిస్తున్నారు. రూ.2వేల నోట్లను ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. కాబట్టి దానికి సమయం దాదాపు 3 నెలల సమయం వుంది. దాంతో నోట్లను మార్చే విషయంలో కంగారు పడాల్సిన పనేమీ లేదని చెబుతున్నారు.
ఇకపోతే 2016లో నోట్ల రద్దు తర్వాత రూ.2,000 నోట్లు ప్రింట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీటిని సర్క్యులేషన్ నుంచి రోలగిస్తున్నప్పటికీ లీగల్ టెండర్‌గా ఉపయోగించవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేస్తోంది. చాలాకాలంగా రూ.2,000 నోట్లపై అయోమయం నెలకొన్న నేపథ్యంలో RBI ప్రస్తుతం నిర్ణయం అన్నింటినీ పటాపంచలు చేసింది.