సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తాజాగా విజయవాడలో జరిగిన NTR శతజయంతి పురస్కారాల ప్రదానోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అందరినీ నవ్విస్తూ మాట్లాడుతాడేమో అని ప్రేక్షకులు అనుకుంటే అతను మాత్రం కాస్త ఫైర్ అయ్యాడు. NTR పురస్కారాన్ని అందుకున్న బ్రహ్మి ఒక ఎమోషనల్ స్పీచ్ స్టార్ట్ చేశాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన కొందరు మొబైల్ ఫోల్‌లో కాల్స్ మాట్లాడుతూ కనిపించారు.
స్పీచ్ ఇస్తున్నప్పుడు బ్రహ్మానందం దీనిని గమనించాడు. ఆ తర్వాత వెంటనే ఫైర్ అయ్యాడు. NTR లాంటి మహానుభావులు గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలని అన్నారు. మొబైల్స్ దయచేసి చూడటం ఆపేయాలని కోరారు. అదే సమయంలో కాస్త అసహనానికి గురవుతూ చేతులు జోడించి దండం పెట్టాడు. తనను మాట్లాడొద్దు అని చెబితే అలానే వెళ్లిపోతానంటూ ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గాను మారింది. ఎప్పుడూ కూల్ గా ఉండి సెటైర్లు పేల్చే బ్రహ్మీ బయట ఇంత సీరియస్ గా ఉంటారా అని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.