Breaking: మాదాపూర్‌లోని టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్‌.. తీరా చూస్తే..

సాధారణంగా బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ వస్తే చాలు ఎవరైనా సరే వణికిపోతారు. అలాంటి బెదిరింపు కాల్‌ తాజాగా మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీకి వచ్చింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కి మాదాపూర్ బ్రాంచ్‌లో బాంబు పెట్టిన‌ట్లు ఒక వ్యక్తి ఫోన్ చేసి తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన కంపెనీ యాజ‌మాన్యం హుటాహుటిన ఈ సమాచారాన్ని పోలీసులకు అందించింది. పోలీసులు టీసీఎస్‌కు చేరుకొని కంపెనీ అంతటా పూర్తిస్థాయిలో చెకింగ్స్ చేపట్టారు. చివరికి బాంబు లేదని తేలింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు ఫేక్ బాంబు కాల్ చేసి అందర్నీ టెన్షన్‌కి గురిచేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ వ్యక్తి ఎవరో తెలిసి పోలీసులు మొదట షాక్ అయ్యారు. ఎందుకంటే అతను ఇంతకుముందు ఈ కంపెనీలో పనిచేసి వెళ్లిపోయిన ఉద్యోగి. ఇలాంటి బెదిరింపు కాల్‌ చేయాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చిందో తెలుసుకుందామని పోలీసులు ప్రయత్నించారు కానీ ప్రస్తుతానికైతే అతడు దొరకలేదు. అతని ఆచూకీ కోసం పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు.