Breaking: భూమా అఖిలప్రియ అరెస్ట్ చేసిన పోలీసులు

మాజీమంత్రి భూమా అఖిలప్రియను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఏవీ సుబ్బారెడ్డిపై మర్డర్ అట్టెంప్ట్‌కి పాల్పడ్డారనే అభియోగంతో ఆమెను అధికారులు అతిలోక తీసుకున్నారు. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్, పీఏ మోహన్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆపై వీరందరినీ నంద్యాల పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
img src=”https://dailytelugunews.com/wp-content/uploads/2023/05/Bhuma-Akhila-Priya.jpg” alt=”” width=”1280″ height=”720″ class=”alignnone size-full wp-image-25450″ />
నిన్న నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీ వర్గాల మధ్య తీవ్రమైన దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దివంగత టీడీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ, ఆయన స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి ఒకరికొకరు ఎదురుపడగా వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ అనూహ్య ఘటనలో ఏవీ సుబ్బారెడ్డి గాయాల పాలయ్యారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చూస్తుండగానే ఇరువైపులా వర్గీయులు కొట్లాడుకున్నారు.

టీడీపీ సీనియ‌ర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్య చేయడానికి భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారని అటువైపు వారు ఆరోపించారు. ఫిర్యాదు కూడా చేశారు. దాంతో పోలీసులు హత్యాయత్నం కేసులో ఇవాళ ఉద‌యం 7.30 గంట‌ల‌కు అఖిల‌ప్రియ అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ టీడీపీ వర్గాలలో పెద్ద సంచలనమే సృష్టిస్తోంది.