బ్రేకింగ్: కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిని చుట్టుముట్టాడిన అవినాష్ రెడ్డి అనుచరులు!

అవును, కర్నూలులో సీబీఐ నోటీసులపై టెన్షన్ వాతావరణం నెలకొంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న అనుమానంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్దకు జిల్లాలోని నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కేసీ కెనాల్ వద్ద నుంచి ఆసుపత్రి వరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి అనుచరులు ఆస్పత్రిని తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

నాలుగు రోజులుగా అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మమ్మ కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ ఆమె చికిత్స పొందుతున్నారు. గుండె నొప్పితో హాస్పిటల్ లో ఆమె చికిత్స తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోమవారం విచారణకు హాజరు కావాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపగా తల్లి అనారోగ్యంగా కారణంగా హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాసిన సంగతి విదితమే. దాంతో మరోసారి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీం కోర్టుని అశ్రయించినట్టు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసారు.