యాంటీ-కరప్షన్ బ్యూరో అవినీతికి పాల్పడిన వారెవరినీ వదిలిపెట్టడం లేదు. కొందరు డబ్బులను అవినీతి మార్గంలో జలగల్లా జుర్రుకుంటున్నారు. వీరి బాగోతాలను అవినీతి నిరోధక శాఖ అధికారులు బట్టబయలు చేస్తున్నారు. తాజాగా వీరికన్ను విజయవాడ దుర్గమ్మ గుడి సూపరింటెండెంట్ అయిన వాసా నగేష్‌పై పడింది. నగేష్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు అతని ఇంటిలో సోదాలు నిర్వహించారు. విజయవాడ కుమ్మరిపాలెం కూడలి లోటస్ అపార్టుమెంట్‌లో నగేష్ అద్దె ఇల్లు ఉంది. ఇక్కడ బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చెకింగ్‌లు చేశారు. పలు డాక్యుమెంట్లు, బ్యాంకు అకౌంటు డీటెయిల్స్ తనిఖీ చేశారు.
ఇక కుమ్మరిపాలెం సెంటరు సమీపంలోని నగేష్ ఇంట్లో రూ.17.91 లక్షల క్యాష్ , 209 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ద్వారకా తిరుమలలో జీ+4 ఇల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలులో మూడు ఇళ్లు, ఒక ప్లాటుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా హ్యాండోవర్ చేసుకున్నారు. ఇంకా మరిన్ని వివరాలను తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి సోదాలు కొనసాగుతాయని అనిశా అధికారులు స్పష్టం.
నగేష్ గతంలో ద్వారకా తిరుమలలో పనిచేశాడు. ఆ సమయంలో గుత్తేదారుల నుంచి జీఎస్టీ వసూలు చేశాడు కానీ వాటిని ప్రభుత్వానికి చెల్లించ లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో సీరియస్ అయిన అధికారులు అతడి ఆ డబ్బులు రికవరీ చేశారు.