Breaking:సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట..

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించింది. జగన్ సర్కార్ మాజీ సీఎం చంద్రబాబు హయాంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తూ వాటిని దర్యాప్తు చేసేందుకు సిట్‌ ఏర్పాటు చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తుకు హైకోర్టు బ్రేకులు వేసింది. దీని ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. కాగా బుధవారం రోజు ఆ స్టేను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగాయని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం తెలుసుకుంది. సిట్ దర్యాప్తుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో సిట్‌ నియామకంపై టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించిన ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ గతంలో తీర్పు వెలువరించింది. ఈ స్టేను తొలగించేందుకు వైస్సార్‌సీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. చేసిన తప్పులను బయట పెట్టేందుకు దర్యాప్తు చేస్తే అందులో తప్పేముంది అన్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.