బడా కంపెనీల బాగోతాన్ని తాజాగా భారత ప్రభుత్వం బయటపెట్టింది. 24 పెద్ద దిగుమతిదారులు రూ.11,000 కోట్ల ($1.5 బిలియన్లు) పన్ను ఎగవేతకు పాల్పడినట్లు భారత ప్రభుత్వ ఏజెన్సీలు గుర్తించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ (DGGI), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఏజెన్సీలు కలిసి తమ దర్యాప్తులో ఉక్కు, ఫార్మాస్యూటికల్, రత్నాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్ రంగాలలోని కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు కనుగొన్నాయి. అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ ఇన్ ఇన్‌డైరెక్ట్ టాక్సేషన్ (ADVIT) సిస్టమ్‌లోని డేటాను ఉపయోగించి పన్ను ఎగ్గొట్టిన కంపెనీలను భారత ఏజెన్సీలు గుర్తించగలిగాయి.
దిగుమతిదారులు, ఎగుమతిదారుల గురించి మరింత సమాచారాన్ని సేకరించడానికి ప్రభుత్వం ఇప్పుడు ADVITని బలోపేతం చేయాలని చూస్తోంది. పన్ను ఎగవేతలను అరికట్టడానికి, ప్రతి ఒక్కరూ తమ న్యాయమైన పన్నుల వాటాను చెల్లించేలా చూసుకోవడానికి ADVIT ప్రభుత్వానికి సహాయపడుతుంది.