Breaking News : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.. అధికారిక పార్టీ నుండి ముందస్తు ఎన్నికలపై ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ.. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయని పదేపదే చెబుతున్నారు.. తాజాగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్ డైరెక్ట్ గా స్పందించారు.. ఇంతకీ జగన్ ముందస్తు ఎన్నికలు వస్తాయని తేల్చి చెప్పారా.. లేదంటే జగన్ ముందస్తు ఎన్నికలకు ఎటువంటి మెలిక పెట్టారో చూద్దాం..!
ప్రకాశం జిల్లా రైతులకు మేలు చేసే లాగా వెలిగొండ ప్రాజెక్టును 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని జగన్ తాజా ప్రకటన చేశారు.. ఈ ప్రకటన తర్వాత జగన్ ముందస్తు ఎన్నికలు రావని చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతుంది.. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఎన్నికలకు వెళదామని స్పష్టంగా చెప్పారు.. అంటే జగన్ ఇచ్చిన మాట ప్రకారం.. ఈ ప్రాజెక్టు సెప్టెంబర్ 2023 నాటికి పూర్తవ్వాలి. కానీ జగన్ ఇచ్చిన మాట ప్రకారం.. ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా అని అంటే మాత్రం అనుమానమే అని చెప్పాలి.. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే నిధులు లేకపోవడమే..
ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చేసేది ఏమీ లేదు. అటువంటి అప్పుడు ఈ ప్రాజెక్టు ను పూర్తి చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని జగన్ చెప్పినా మాటల్లో అంతర్లీనంగా అర్థమవుతున్నది ఏమిటంటే.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని జగన్ స్పష్టంగా చెప్పినట్లేనా.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చినట్లే అని తెలుస్తోంది.. ప్రధాన ప్రతిపక్ష లేదా చంద్రబాబు ఒకవైపు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం హోరెత్తిస్తుంటే.. మరోవైపు అధికారిక పార్టీ నుంచి ముందస్తు ఎన్నికలు లేనట్టు జగన్ క్లారిటీ ఇచ్చారు..