Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీలో అనేక సినిమాలు చేసిన ఈ స్టార్ హీరోయిన్ తెలుగులో ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమా చేసింది. ఈ సినిమా పరాజయం చెందడంతో తర్వాత మరో సినిమా చేయలేదు. రెండు దశాబ్దాల నుండి హీరోయిన్ గా రాణిస్తున్న కంగనా.. ప్రస్తుతం హిందీ సినిమాల పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది.
ఈ క్రమంలో గ్లామర్ సినిమాల కంటే ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇదే సమయంలో బీజేపీ పార్టీకి మద్దతుగా అడపాదడపా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటది. తాజాగా కంగనా సినీనటి ఏపీ మంత్రి రోజాపై కామెంట్లు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే రాజకీయాల్లోకి వస్తే సినిమాలను వదులుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మంత్రి రోజా కామెంట్లు చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను కంగనా వద్ద కొంతమంది మీడియా ప్రతినిధుల ప్రస్తావించారు.. దీనికి ఆమె అసలు రోజా అంటే ఎవరు అంటూ మీడియా విలేకరులను ఎదురు ప్రశ్నించారు.
ఆమె ఎవరో తనకు తెలియనప్పుడు… ఆమె గురించి తాను ఏం మాట్లాడతానని అన్నారు. రాజకీయాల్లో తనకు అవకాశం వస్తే.. వదులుకోనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తనకు దేశభక్తి అంటే చాలా ఎక్కువ అని అందుకే పేదలకు తనకు తోచిన సాయం చేస్తానని స్పష్టం చేశారు. ఇండియా పేరును భారత్ గా మార్చాలని రెండు సంవత్సరాల క్రితమే తాను చెప్పినట్లు కంగనా కీలక వ్యాఖ్యలు చేశారు.