Pathaan: షారూఖ్ ఖాన్ పఠాన్ రివ్యూ .. ఇంటర్నెట్ లో ఫస్ట్ రివ్యూ !

Pathaan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. నాలుగేళ్ల విరామం తర్వాత షారుక్ ఖాన్ నుంచి వచ్చిన సినిమా ఇది.‌ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఎక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది..

Advertisement
bollywood sharukh khan Pathaan Movie first review
bollywood sharukh khan Pathaan Movie first review

సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో షారుక్ సరసన దీపిక పదుకొనె నటించింది. హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఈసారి షారుఖ్ ఖాన్ స్ట్రాటజీని మార్చేశారు. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో పన్ ఇండియా రేంజ్ లో మూడో స్థానంలో నిలిచింది. ఈ సినిమాలో హీరో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా అతిధి పాత్రలో ఉన్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే ఉమైర్ సందు పఠాన్ మూవీ రివ్యూ చెప్పేశారు..పటాన్ సినిమా పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ ఇప్పటివరకు చూసిన బాలీవుడ్ చిత్రాలు ఇదే బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమని చెప్పుకోవచ్చు.. ఈ సినిమాలో షారుక్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం పెర్ఫార్మెన్స్ హైలెట్గా నిలిచింది.

ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ఇప్పటివరకు మీరు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది. ఇక షారుఖ్ ఖాన్ కొన్ని మాస్ యాక్షన్ సీన్స్ లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్గా పటాన్ సినిమా నిలుస్తుంది . ఈ సినిమాకు నేను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. ఆర్ఆర్ చిత్రానికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాను. ఇప్పుడు పటాన్ చిత్రానికి ఇస్తున్నాను. ఈ సినిమాకు ఆ అర్హత ఉందని ఉమర్ సందు ట్విట్టర్లో రాసుకొచ్చారు. మొత్తానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ పేర్కొన్నారు మరి ఏమవుతుందో చూడాలి..

Advertisement