Big Breaking: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. తెలంగాణాలో ఈ ఏడాది మొత్తం తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయగా 5 లక్షల మంది ఫస్ట్ ఇయర్, 4.5 లక్షల మంది సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌కు హాజరయ్యారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల కాసేపటి క్రితమే విడుదల చేసారు. నాంపల్లిల్లోని ఇంటర్ బోర్డ్‌ కార్యాలయంలో సరిగ్గా ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయడం జరిగింది.

విద్యార్థుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ ఫలితాలు విడుద‌ల కబడ్డాయి. ఇకపోతే ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు నిర్వహించిన సంగ‌తి అందరికీ తెలిసిందే. ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు ఐదు ల‌క్షల మంది విద్యార్థులు హాజరు కావడం విశేషం.

గమనిక: ఫలితాలను http://www.schools9.com/ మరియు https://www.manabadi.com/ ద్వారా చెక్ చేసుకోగలరు. ఇంకా http://tsbie.cgg.gov.in/ లేదంటే http://examresults.ts.nic.in/ ద్వారా కూడా చెక్ చేసుకోగలరు.