Big Breaking: తెలంగాణ 10th ఫలితాలు విడుదల..!

తెలంగాణలో 10th క్లాస్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. తాజాగా పదో తరగతి ఫలితాలను మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసారు. గోదావరి ఆడిటోరియం గ్రౌండ్ ఫ్లోర్ లో మంత్రి సబిత టెన్త్ రెగ్యూలర్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను వెల్లడించారు. తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. పది పరీక్షలకు 7,39,493 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి:

1. తెలంగాణ టెన్త్ క్లాస్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in సందర్శించాలి.

2. తరువాత హోం పేజీలో TS SSC Results 2023 లింక్ మీద క్లిక్ చేయాలి.

3. ఇపుడు మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.

4. వివరాలు నమోదు చేసిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.

5. ఇపుడు స్క్రీన్ మీద విద్యార్థి 10వ తరగతి ఫలితాలు కనిపిస్తాయి. తరువాత మార్క్స్ మెమోను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదంటే ప్రింటౌట్ తీసుకోవచ్చు.

గమనిక: bse.telangana.gov.in అధికారిక వెబ్ సైట్ మాత్రమే కాకుండా మీ ఫలితాలను http://www.schools9.com/ మరియు https://www.manabadi.com/ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.