Big Breaking: అధ్యక్ష పదవికి శరద్ పవర్ రాజీనామా..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ తాజాగా మాట్లాడుతూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి షాకిచ్చారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకూడదనే తన నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. తన బయోగ్రఫీ సెకండ్ ఎడిషన్ ‘లోక్ మేజ్ సంగతి’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. 1960లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పవార్, తన రాజ్యసభ పదవీకాలం మూడేళ్లు మిగిలి ఉందని, అయినా ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. అత్యాశతో ఉండకూడదని, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఆపేయాలని కూడా ఆయన సలహా ఇచ్చారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో వివిధ పదవులను నిర్వహించిన పవార్ భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా కొనసాగారు. కాగా పవార్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పవార్ నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రంలో మంత్రి శాఖలను నిర్వహించారు. ఆయన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. పవర్ ఎన్సీపీ అధ్యక్ష పదవి పగ్గాలు వదిలేసిన తర్వాత దానిని ఎవరు భర్తీ చేస్తారనేది చూడాలి.