Categories: News

Big Breaking: 75 రూపాయల నాణెం విడుదల: ఆర్థిక మంత్రిత్వ శాఖ

దేశ రాజధానిలో ప్రత్యేక హంగులతో రూపుదిద్దుకున్న పార్లమెంట్ భవనం ఈ నెల 28వ తారీఖున ప్రారంభం కానుందనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా ప్రత్యేకంగా 75 రూపాయల నాణేన్ని విడుదల చేయనుండడం విశేషం. కాసేపటి క్రితమే ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక ఈ నాణెం ప్రత్యేకతలు ఏమంటే, ఒకవైపు జాతీయ చిహ్నాలైన 3 సింహాలు, మరో వైపు కొత్త పార్లమెంట్ భవనాన్ని ముద్రించారు. కాగా ఈ నాణెం 44 మిల్లీ మీటర్ల డయాను కలిగి ఉంటుంది. 200 సెర్రేషన్స్‌తో ఇది తయారయింది. 50 శాతం సిల్వర్, 40 శాతం కాపర్, అయిదు చొప్పున నికెల్, జింక్‌ ధాతువులను ఈ కాయిన్ తయారీలో వినియోగించినట్టుగా తెలుస్తోంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.