Big Breaking: RBI సంచలన నిర్ణయం, రూ.2వేల నోటు ఇక ఉండకూడదు?

అవును, మీరు వినోదినిజమే. రూ.2వేల నోట్లపై RBI (రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను ఇకనుండి సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను, ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చని, లేదంటే డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తెలిపింది.

ఈ క్రమంలో జనాలకి కొన్ని సూచనలు చేసింది రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా. ప్రజలు ఒక్కసారి గరిష్టంగా రూ.20వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని, లేదంటే మార్చుకోవచ్చని పేర్కొంది. అలాగే బ్యాంకులు కూడా ఖాతాదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని RBI తేల్చి చెప్పింది. కాబట్టి అందరూ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తమవద్దనున్న రూ.2వేల నోట్లను, ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవాలని మనవి.