తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైకోర్టు వద్ద ఓ యవకుడిని దుండగుడు కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు. చనిపోయిన యువకుడు గేట్ నంబర్ 6 సమీపంలో ఉన్న సులబ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతుడిని మిథున్‌గా పోలీసులు గుర్తించారు. మిథున్‌ని చంపేసిన సదరు దుండగుడు పోలీసులకి లొంగిపోయాడు.
వీరి మధ్య పెద్ద కక్షలు ఏమీ లేవు. కేవలం రూ.10 వేల కోసం వీరు కూడా పడ్డారు. అదే విషయంలో వారి మధ్య గొడవ చినుకు చినుకి గాలివానై చివరికి ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది మరొకరిని జైలు పాలు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ మర్డర్ కేసును పోలీసులను నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు.