కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గీత కార్మికుల జీవితాలు బాగుపడ్డాయి. వారికి తెరాస సర్కార్ పెన్షన్ ఇవ్వడంతో పాటు చెట్టు పన్ను రద్దు చేసింది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం వారికి మరోసారి తీపి కబురు అందించింది. గీత కార్మికులకు బీమా కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బీమా మాదిరిగానే కల్లు గీత కార్మికులకు బీమా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్ణయించింది. కల్లు గీసేవారు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలు జరిగి వారు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. దీనివల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ఈ పరిస్థితి రాకూడదని గీత కార్మికులకు రూ.5 లక్షల బీమా ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విధివిధానాలను కూడా రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా అనేది ఆలస్యం అవుతుంది. దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ కొత్త పథకానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.