ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి AIF ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడే కూలిపోయింది. రాజస్థాన్లోని సూరతర్ నుండి బయలు దేరిన మిగ్-21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ హనుమాన్ ఘర్ వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా నేలకొరిగింది. ఆ వెంటనే మంటల్లో కాలి బూడిదయినట్టు తెలుస్తోంది.
కాగా ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ పైలట్ సేఫ్ గా బయటపపడ్డాడు. అయితే అందులో పయనిస్తున్న ఇద్దరు పౌరులు మృతిచెందడంతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తాజా సమాచారం. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా అధికార సమాచారం అందాల్సి ఉంది.