Big Breaking: సరిగ్గా అరగంటలో హైదరాబాద్ వాళ్లకి బిగ్ న్యూస్!

అవును, హైదరాబాద్ వాసులకు సరిగ్గా మరో అరగంటలో అద్బుతం జరగబోతోంది. అదేమిటంటే ఆరోజున మీ నీడ మీకు కనిపించదండోయ్. ఇక మీరు నా నీడ నన్ను విడిచి పోయింది అని అరవాల్సిందే. మీరు నమ్మినా, నమ్మకపోయినా.. ఇది వాస్తవం. కావాలంటే మీరు ఒకసారి ఎండలోకి వెళ్లి చెక్ చేసుకోండి. అందుకే నేటిని “జీరో షాడో డే”గా పేర్కొనవచ్చు. ఈ జీరో షాడో టైమ్‌లో మనిషిపైన మాత్రమే కాదు, ఏ వస్తువుపైన సూర్యుడి కాంతి పడ్డా నీడ మాత్రం అస్సలు కనిపించదు. దీనినే టెక్నికల్ భాషలో “జెనిత్ పొజిషన్” అని అంటారు.

ఈ కారణంగానే జీరో షాడో డే ఏర్పడుతుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈరోజు అనగా 9వ తేదీన మధ్యాహ్నం సరిగ్గా 12.12 గంటలకు దాదాపు 2నిమిషాల పాటు మన నీడ మనకు కన్పించదు. ఆ సమయంలో హైదరాబాద్ నగరంలో సూర్య కిరణాలు నిట్ట నిలువుగా పడతాయని, అందుకే నీడ కన్పించదని BMబిర్లా సైన్స్ సెంటర్ అధికారులు తాజాగా వెల్లడించారు. అవును, అంటే 12 గంటల 12 నిమిషాల సమయంలో ఎండలో 90 డిగ్రీల కోణంలో ఉంచిన ఏ వస్తువు నీడ కూడా 2 నిమిషాల పాటు కనిపించదని సైంటిస్టులు అంటున్నారు. ఇలాంటి అరుదైన సంఘటనలు ప్రతీ సంవత్సరం రెండుసార్లు మాత్రమే జరుగుతాయని అంటున్నారు.

Advertisement
Advertisement

Advertisement