ప్రముఖ తెలుగు నటుడు శరత్ బాబు తాజాగా కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు ఏఐజి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల అతని ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. దాంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐసి హాస్పిటల్‌కి తరలించారు. ఇవాళ అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఈరోజు సాయంత్రం అతని అనారోగ్య పరిస్థితి మరింత సీరియస్ గా మారి కన్నుమూశారు.
శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన శరత్ బాబు 2023, మే 3న అంటే ఈరోజు తుది శ్వాస విడిచాడు. 71 ఏళ్ల వయసులో శరత్ బాబు ఈ లోకాన్ని వదిలి తెలుగు ప్రేక్షకులను శోకసంద్రంలో ముంచేశారు. సీతాకోకచిలుక, ఓ భార్య కథ, నీరాజనం వంటి సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా అద్భుతంగా నటించి నంది అవార్డులను కూడా గెలుచుకున్నాడు. నటనలో ఎంతో వైవిధ్యాన్ని కనబరిచిన శరత్ బాబు చనిపోవడం టాలీవుడ్ పరిశ్రమకి తీరని లోటు అని చెప్పవచ్చు.