టాలీవుడ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేటి యువతలో అతనికంటూ ఓ ప్రత్యేకమైన స్థానం వుంది. ఇక బాధాకరమైన విషయం ఏమిటంటే శర్వానంద్ ప్రయాణిస్తున్న కారుకి ఈరోజు ఆదివారం ఉదయం యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తోంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో శర్వానంద్ తన డ్రైవర్‌తో కలిసి ఫిల్మ్ నగర్‌లో తన రేంజ్ రోవర్ కారులో పయనిస్తున్నారు. ఇంతలో సరిగ్గా ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అదృష్టవశాత్తూ డ్రైవర్ పక్కనే కూర్చున్న శర్వానంద్ స్వల్ప గాయాలతో బయట పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై ఇటు శర్వానంద్ కానీ.. ఆయన టీమ్ కానీ ఇంతవరకు స్పందించపోవడం గమనార్హం. కాగా ప్రమాదం జరిగిన సమయంలో అసలు ఆ కారులో శర్వానంద్ లేరని కొందరు చెప్పడం కొసమెరుపు. అయితే దీనిపైన ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి వుంది.