Big Billion Days Sale : బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఈ స్మార్ట్ ఫోన్.. రూ.30 వేల తగ్గింపుతో..!

Big Billion Days Sale : కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు బంపర్ ఆఫర్.. కాదు కాదు.. కళ్ళు చెదిరే ఆఫర్ మీకోసం అందుబాటులో ఉందని చెప్పవచ్చు. ప్రీమియం ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి అద్భుతమైన క్రేజీ డీల్ ఎదురుచూస్తోంది. ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ ను తీసుకురావడం జరిగింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా కస్టమర్లకు ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.. కస్టమర్లు రియల్ మీ GT 2 ప్రో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.26,999 కే సొంతం చేసుకోవచ్చు. నిజానికి ఈ ఫోన్ అసలు ధర రూ.57,999.

ఇక బిగ్ బ్యాంగ్ రివిల్ ఆఫ్ ది డే మైక్రో సైట్ ద్వారా ఫ్లిప్కార్ట్ ఈ వివరాలను వెల్లడించింది.. రియల్ మీ జిటి 2 ప్రో స్మార్ట్ ఫోన్ లిస్టింగ్ ధర ప్రకారం రూ.60 వేలకు పైగానే ఉంది . కానీ ఈ ఫోన్ ధర రూ.57,999. ఇక దీన్ని కస్టమర్లు కేవలం రూ.26, 999 కే సొంతం చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు పై ఉన్న బ్యాంక్ ఆఫర్లను కలుపుకొని మీకు ఈ ఆఫర్ లభిస్తుంది. ఇక ఇందులో ఫీచర్స్ విషయానికి వస్తే 8GB ర్యామ్ అలాగే 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999 .. అలాగే 12 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999.

Big Billion Days Sale This smartphone is Rs.30 thousand
Big Billion Days Sale This smartphone is Rs.30 thousand

అంటే ఈ ఫోన్ కొనాలని భావిస్తున్నట్లయితే బిగ్ బిలియన్ డేస్ లో కొంటేనే మీకు మరింత ఆఫర్ లభిస్తుంది అని చెప్పవచ్చు.6.7 అంగుళాల క్వాడ్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. 120 HZ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 8 Gen 1 ప్రాసెస్ అమర్చబడింది. ఇక ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. అంతేకాదు ఇందులో 5G ఫీచర్ కూడా ఉంది. 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీ ని కలిగి ఉన్న ఈ స్మార్ట్ఫోన్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ , 50 మెగాపిక్సల్ సెకండరీ సెన్సార్ తో పాటు 2 మెగా పిక్సెల్ మైక్రో లెన్స్ కెమెరా కూడా ఉంది. ఇక వీడియో, సెల్ఫీ కోసం 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా అమర్చారు.