Smart Phones : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ నిత్యవసరంగా మారింది. ఇక ప్రతి విషయాన్ని కూడా సెల్ ఫోన్ ద్వారానే చేస్తూ ఉండడంతో చాలా మందికి స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఇకపోతే వినియోగదారులు ఎక్కువ పనులను స్మార్ట్ ఫోన్ ద్వారానే చేస్తున్న నేపథ్యంలో అధిక ర్యామ్ ఫీచర్ తో కూడిన స్మార్ట్ ఫోన్లను కూడా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇకపోతే ఈ క్రమంలోని ప్రముఖ మొబైల్ కంపెనీలు కూడా అధిక ర్యామ్ కెపాసిటీ తోపాటు వేరియంట్ ఆప్షన్లను కూడా లాంచ్ చేసే దిశగా కొత్త ఫోన్లను ప్రవేశపెడుతోంది. మరి వాటి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
Vivo X80 Pro స్మార్ట్ ఫోన్ : 6.78 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 8Gen 1SOC ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత OriginOS పై రన్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సన్ అమర్చబడింది.12GB ర్యామ్ కెపాసిటీ తో వస్తుంది.
IQoo 9pro స్మార్ట్ ఫోన్ : ఈ స్మార్ట్ ఫోన్ మీకు 6.78 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాదు 120 Hz రీఫ్రెష్ రేట్ తో, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 8Gen 1SOC ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది అంతేకాదు ఆండ్రాయిడ్ 12 పై రన్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ మీకు 12GB ర్యామ్ ను అందిస్తుంది. అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందిస్తుంది ఇక ఇందులో ప్రధాన కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్ ను కలిగి ఉండడం గమనార్హం.
Samsung Galaxy S22 Ultra : 6.8 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ తో వస్తుంది. అంతేకాదు ప్రధాన కెమెరా 108 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. ఇక 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. వీటితోపాటు షావోమి 12 ప్రో స్మార్ట్ ఫోన్, Asus ROG ఫోన్ 5 స్మార్ట్ ఫోన్ వంటివి 12 GB ర్యామ్ కెపాసిటీ తో లభిస్తాయి.