SmartPhones : ఈమధ్య కాలంలో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కొనాలని ఆలోచించే వారి సంఖ్య ఎక్కువ అయింది. ఇక ఈ నేపథ్యంలోనే ₹7,000 ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ లు ఈరోజు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. బడ్జెట్ ధరలో లభించే ఫోన్ల లిస్టు ఇదే.. గెలాక్సీ A03 కోర్: సాంసంగ్ గాలక్సీ A03 కోర్ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్డి 1600 X 720 పిక్సెల్స్ రెజల్యూషన్ తో ముందు భాగంలో వీ కటౌట్ నోచ్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో మైక్రో ఎస్డి కార్డ్ వన్ టీబీ వరకు స్టోరేజ్ ను పెంచే ఎంపికతో 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ తో జత చేయబడింది.. వెనుక భాగంలో 8 ఎంపీ సింగిల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది. ఇక ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక మరిన్ని ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రూ.7వేల ధరకే ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తూ ఉండడం గమనార్హం..
మైక్రోమ్యాక్స్ ఇన్ వన్ బి : 6.5 అంగుళాల డిస్ప్లే తో 20:9 ఆస్పెక్ట్ రేడియోతో హెచ్డి రిజర్వేషన్ తో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే..13ఎంపీ +5ఎంపీ డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో అలాగే ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో లభిస్తుంది. G35 మీడియా టెక్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే యూఎస్బీ టైప్ సి పోర్టుతో లభిస్తుంది.
నోకియా సి 3 : ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ ఫుల్ స్క్రీన్ తో 120 ఎడ్జెస్ టచ్ షాంప్లింగ్ రేటుతో కలిగి ఉంటుంది. 2GB/3GB ర్యామ్ అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 8 ఎంపీ సింగల్ కెమెరాతో సెల్ఫీ కోసం 5 ఎంపీ సెల్ఫీ కెమెరాలు అమర్చబడింది. 10 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mah బ్యాటరీని కలిగి ఉంటుంది.
రెడ్మీ 9 A : 6.53 అంగుళాల హెచ్డి రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. రెడ్మీ 9A మీడియా టెక్ హెలియో జీ 25 ప్రాసెసర్ యొక్క ఆక్టా కోర్ సి పి యు తో పని చేస్తుంది. ఇక 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 WAA బ్యాటరీ చార్జింగ్ తో పని చేస్తుంది.