Best Recharge Plans : జియో వాల్యూ ప్యాక్ కావాలా.. అయితే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..!

Best Recharge Plans : రిలయన్స్ జియో మొబైల్స్ టాక్ టైం పరంగా ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉంటుందో తెలుసుకొని మరీ అందుకు సంబంధించిన వ్యాల్యూ ప్యాక్ ని అందుబాటులోకి తీసుకొస్తోంది. అలాగే ఉద్యోగం చేసే వారిని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు 2GB డేటా అందించే ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తూనే మహిళలను దృష్టిలో పెట్టుకొని ఉచిత డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లకు సంబంధించిన రీఛార్జ్ ప్లాన్స్ ని కూడా అందిస్తోంది. డేటాతో పని లేకుండా కేవలం టాక్ టైం వస్తే చాలు అనుకునే వారి కోసం కూడా కొద్దిగా పరిమాణంలో డేటాను అందిస్తూనే 336 రోజుల పాటు లభించే వ్యాల్యూ ప్యాక్ ని కూడా అందుబాటులోకి తీసుకొస్తూ మరింత నెంబర్ వన్ గా నిలిచింది రిలయన్స్ జియో.. ఇప్పుడు నెల మొదలుకొని ఏడాది పాటు డేటాతో సంబంధం లేకుండా కాల్స్ మాత్రమే ఎక్కువగా వినియోగించే వారికి తక్కువ ధరకే ఎక్కువ రీఛార్జ్ అన్నట్టుగా రిలయన్స్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి వాటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం..

రూ.155 జియో రీఛార్జ్ వాల్యూ ప్యాక్ :  ఈ రీఛార్జ్ ప్లాన్ మీకు 28 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తుంది. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ను కూడా పొందవచ్చు. జియో నుంచి ఏ ఇతర టెలికాం సంస్థకైనా ఉచితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక 28 రోజులకు గాను 300 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. అంతేకాదు 2GB అత్యవసర డేటా కూడా లభిస్తుంది. ఇక వీటితో పాటు అదనంగా జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్ లను కూడా ఉచితంగా సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఇక నెలవారి రీచార్జ్ వాల్యూ ప్యాక్ కోసం ఎదురు చూసే వారికి ఇది బెస్ట్ బెనిఫిట్ అని చెప్పాలి.

Best Recharge Plans if you want Jio Value Pack
Best Recharge Plans if you want Jio Value Pack

రూ.395 జియో రీఛార్జ్ వాల్యూ ప్యాక్ : ఈ ప్లాన్ మీకు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు 1000 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. ఇక 84 రోజుల గాను 6GB హై స్పీడ్ డేటాను పొందవచ్చు. అలాగే అన్ని జియో యాప్లకు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంటుంది.

రూ.1559 జియో రీఛార్జ్ వాల్యూ ప్యాక్ : 336 రోజుల వ్యాలిడిటీని ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాల్ తో పాటు 3600 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. అలాగే 24GB హై స్పీడ్ 4జి డేటాను పొందవచ్చు. అంతేకాదు అన్ని జియో యాప్ లను ఉచితంగా సబ్ స్క్రిప్షన్ చేసుకోవచ్చు.