Business Idea : చాలామందికి సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఒకవేళ మీరు సొంతంగా ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారా? అయితే మీలాంటి వారికోసం ఒక శుభవార్త. అదే కార్ వాషింగ్ బిజినెస్. ప్రతిరోజు 2000 రూపాయలు ఆదాయం ఇచ్చే వ్యాపారం ఇది. ప్రస్తుతం మన భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి నిరంతరం పెరిగిపోతుంది. వాహనాల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది.2021-22 వ సంవత్సరంలో దేశంలో 1,75,13,596 వాహనాలను విక్రయించడం జరిగింది. వాహనాల సంఖ్య పెరుగుతున్న కారణంగా ఆటో మొబైల్ వ్యాపారాలు మంచిగా నడుస్తున్నాయి. ఇలాంటి వ్యాపారాల్లో కార్ వాషింగ్ వ్యాపారం ఒకటి. కార్లు లేదా ఇతర వాహనాలను కడగడం ద్వారా ప్రతి నగరంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు.
ఈ వ్యాపారంలో 70% ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో చాలామంది దగ్గర వాహనాలు ఉన్నాయి కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోవడానికి తీరిక ఉండటం లేదు . చాలావరకు తమ వాహనాలను వాషింగ్ సెంటర్స్ లో కడిగించడానికి మొగ్గు చూపుతున్నారు. మీ దగ్గర తక్కువ డబ్బు ఉన్నట్లయితే మీరు ఈ కారు వాషింగ్ సెంటర్ ను మొదలు పెట్టవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కనీసం మీకు 1500 చదరపు అడుగుల స్థలం, నీరు, ఇద్దరు కార్మికులు, విద్యుత్ కనెక్షన్ ఉన్న యంత్రాలు అవసరం అవుతాయి. కారును పార్క్ చేయడానికి, కార్ వాషింగ్ స్టాండ్ ని పెట్టడానికి, మరియు వాటర్ పంపులకు, కస్టమర్లు కూర్చోవడానికి స్థలం అవసరం అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది : కారు మరియు ఇతర వాహనాలను కడగడం కోసం కొన్ని యంత్రాలు అవసరమవుతాయి.

మీకు ఫోమ్ జెట్ సిలిండర్, హై ప్రెజర్ వాటర్, ఎయిర్ కంప్రెసర్, మరియు వ్యాక్యూమ్ క్లీనర్ అవసరమవుతుంది. ఇవి ఖరీదైనవి కావు. వీటిని కేవలం రెండు లక్షల రూపాయల్లోనే కొనవచ్చు. ఒకవేళ మీకు సొంత స్థలం ఉన్నట్లయితే చాలా తక్కువ ఖర్చుతోనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఈ వ్యాపారం చేయడం ద్వారా అధిక మొత్తంలో డబ్బు వస్తుంది. ఎందుకనగా.. వాహనాలను కడిగేందుకు వాడే సామాగ్రి ధర చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో కరెంటు, నీటి బిల్లులు,కూలీలకు చెల్లించే వేతనాలకు మాత్రమే ఖర్చవుతుంది. కనీసం ప్రతిరోజు 20 వాహనాలు వాషింగ్ కొరకు వస్తే.. మీకు 3000 వరకు ఆదాయం వస్తుంది. మిగతా ఖర్చులు అన్నీ పోగా.. ప్రతిరోజు 2000 వరకు డబ్బు వస్తుంది. రోజుకి 2,000 వరకు అంటే నెలకు 60 వేల వరకు ఈజీగా సంపాదించవచ్చు. ఈ వ్యాపారంలో మీకు కస్టమర్లు పెరుగుతున్న కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది.