Best Airtel Plans : డైలీ 2GB డేటా అందించే బెస్ట్ ఎయిర్టెల్ ప్లాన్స్ ఇవే..!!

Best Airtel Plans : భారతదేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లలో భారతీయ ఎయిర్టెల్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రతిరోజూ 2GB డేటాను అందించే కొన్ని ముఖ్యమైన ఎంపిక ప్లాన్లను తీసుకురావడం జరిగింది. ఇక వాటి గురించి మనం చదివి తెలుసుకుందాం..

రూ.319 ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ లో నెలరోజుల పాటు వ్యాలిడిటీ మీకు లభిస్తుంది. ప్రతిరోజు 2GB డేటా తో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే అపోలో 24/7 సర్కిల్ సబ్ స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఫాస్ట్ ట్యాగ్ పై 100 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు .

రూ.359 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటాను అందిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్ లతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా ఉంటుంది. అలాగే 28 రోజులపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ ను కూడా అందిస్తుంది. అదనంగా ఈ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్ సబ్ స్క్రిప్షన్, ఎక్స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ , ఫాస్ట్ ట్యాగ్ లో 100 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటూ ఉచిత హల్లో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ కి ఉచితంగా సబ్స్క్రైబ్ పొందే అవకాశం ఉంటుంది.

Best Airtel Plans with 2GB Data Daily
Best Airtel Plans with 2GB Data Daily

రూ.399 రీచార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ మీకు 28 రోజుల చెల్లుబాటుతో ప్రతిరోజు 2.5 జిబి డేటాను అందిస్తుంది. అంతేకాదు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా పొందవచ్చు. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మూడు నెలల ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. అంతేకాకుండా అపోలో 24/7 సర్కిల్ సబ్స్క్రిప్షన్, ఫాస్ట్ ట్యాగ్ పై 100 రూపాయల క్యాష్ బ్యాక్ ,ఉచిత హలో ట్యూన్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.

రు.499 రీఛార్జ్ ప్లాన్ : 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటాను పొందవచ్చు. మొబైల్ కు సంవత్సరం పాటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ పొందుతారు.అంతేకాకుండా అపోలో 24/7 సర్కిల్ సబ్స్క్రిప్షన్, ఫాస్ట్ ట్యాగ్ పై 100 రూపాయల క్యాష్ బ్యాక్ ,ఉచిత హలో ట్యూన్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.