Bank.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండడం తప్పనిసరి అయిపోయింది. బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక మార్పుల కారణంగా.. డబ్బు పంపడం, స్వీకరించడం సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. కొన్ని కొన్ని సార్లు మన డబ్బు బ్యాంకుల్లో తీసివేయబడుతుంది . అయితే ఎందుకో కూడా తెలియదు.. కొన్నిసార్లు సందేశాలు కూడా రావు .. కాబట్టి మీ ఖాతా నుంచి ఈ మధ్యకాలంలో రూ. 436 కూడా మినహాయిస్తే .. మీకు బీమా పాలసీ ఉందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలలో ఆటో డెబిట్ ను రిజిస్టర్ తీసుకొని ఉంటే ఈ డబ్బు మీ ఖాతా నుండి తీసివేయబడి ఉంటుంది.
18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ప్రధానమంత్రి జీవనజ్యోతి, సురక్ష బీమా యోజన పథకాలకు అర్హులు. బ్యాంకు ఖాతాల కోసం కేవైసీ కింద ఆధార్ యొక్క ప్రాథమిక రూపంగా ఆధార్ ఉపయోగించబడుతుంది. రూ.2 లక్షల జీవిత బీమా పాలసీ జూన్ 1 నుంచి మే 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది. వార్షిక ప్రీమియం రూ. 436 మరియు ప్రతి వార్షిక కవరేజ్ వ్యవధిలో మే 31న అంతకుముందు సబ్స్క్రైబ్ ఖాతా నుండి ఆటో డెబిట్ చేయబడుతుంది. ఇక మీ ఖాతా నుండి డబ్బులు దీనికోసమే కట్ అవుతాయని గుర్తించాలి.