VeeraSimha: నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా మొదటి రోజు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో ఊచకోత కోశారు.. ఇక రెండో రోజుకి వచ్చే సరికి భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ.. మూడో రోజు కి వచ్చే సరికి రిమార్కబుల్ గ్రోత్ ని కనబరిచారు. ఈ సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము దులిపేసింది..
బాలయ్య వీర సింహారెడ్డి సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 48.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకొని.. వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 61 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. మూడో రోజు బాలయ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు చేశారని సమాచారం. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 12.50 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 13.5 కోట్ల నుండి 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ రావచ్చని అంచన. మూడు రోజులలో తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం మించి పోయే కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. కాగా ఇక నాలుగో రోజు కూడా ఇదే జోరు కొనసాగితే 100 కోట్ల కుంభస్థలం బాలయ్య ఢీకొట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ కలెక్షన్స్ తో వాల్తేరు వీరయ్య కు సవాల్ విసిరినట్టే.